నమస్తే శేరిలింగంపల్లిః వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని నాలా విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసన సభ్యులు అరెకపూడి గాంధీ అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్ కాలనీలో నాలా విస్తరణ పనుల్లో భాగంగా సత్యనారాయణ ఎన్ క్లేవ్ వద్ద రూ. 1.55 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన నాలా పనులను హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాస రావు. ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ పరిశీలించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడకుండా పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చేస్తున్నామని, అదేవిధంగా రాబోయే వర్షకాలంను దృష్టిలో పెట్టుకొని ప్రజా అవసరాల దృష్ట్యా నాలా విస్తరణ నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట ఈఈ శ్రీకాంతిని, డీఈ లు స్రవంతి, విశాలాక్షి, ఏఈ శివప్రసాద్, ఏఈ ప్రతాప్, వర్క్ ఇన్ స్పెక్టర్లు జగన్, ప్రసాద్, చందానగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు రవీందర్ రెడ్డి, గురుచరణ్ దూబే, సత్యనారాయణ ఎన్ క్లేవ్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.