నమస్తే శేరిలింగంపల్లిః చేతితో తయారు చేసిన బట్టలు, హస్తకళా ఉత్పత్తులను మాత్రమే శిల్పారామంలో సందర్శకులకు విక్రయించాలని, పవర్ లూమ్, మిషన్ల మీద తయారు చేసిన ఉత్పత్తును ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదని ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ చీఫ్ అధికారి ఆది నారాయణ తెలిపారు. మాదాపూర్ లోని శిల్పారామంలో వీవర్స్ సర్వీస్ సెంటర్ హైదరాబాద్, భారత ప్రభుత్వం , డెవలప్మెంట్ అఫ్ హ్యాండ్లూమ్ శిల్పారామం లో ఉన్న చేనేత హస్తకళాకారులకి చేనేత వస్త్రాల రక్షణ (ఉత్పత్తి చట్టం-1985 ), భారతదేశ చేనేత బ్రాండ్, చేనేత ఆర్టికల్స్ ఉత్పత్తుల కోసం జీఐ ట్యాగ్ ఉన్న చేనేత వస్తువులు, ఉత్పత్తులకు రక్షణ కల్పించడం, తద్వారా చేనేత పేరుతో నకిలీ ఉత్పత్తులను విక్రయించడం, తదితర అంశాలకు సంబంధించిన విషయాలపై అవగాహన కల్పించారు. చేనేతలు, చేతి వృత్తి దారులు తయారు చేసిన ప్రతి ఉత్పత్తి గవర్నమెంట్ అఫ్ ఇండియా GI -Geographical Indicate ట్యాగ్ ఉన్న వాటినే సందర్శకులకు అమ్మాలని సూచించారు. లేని పక్షంలో ఎన్ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ కఠినంగా చర్యలు తీసుకుంటారని చెప్పారు. చేనేత హస్తకళాకారులకు హాలోగ్రామ్ ఉన్న డిజిటల్ ఆన్లైన్ ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు. భారతదేశం లో ఉన్న అన్ని చేనేత హస్త కళా ఉత్పత్తుల గురించి సమావేశంలో వివరించారు. శిల్పారామం లో అర్బన్ హట్ కింద ఉన్న నియమనిబంధనలను కఠినంగా పాటించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో రీజినల్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ డాక్టర్ అరుణ్ కుమార్, శిల్పారామం జనరల్ మేనేజర్ అంజయ్య, పవన్ కుమార్, బాలాజీ, మురళి కృష్ణ, డీసీ హ్యాండ్లూమ్స్ అధికారులు పాల్గొన్నారు.