నమస్తే శేరిలింగంపల్లి: ఓబీసీ కమిషన్ కు 123వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ భద్రత కల్పించడం సంతోషకరమని, ఈ నిర్ణయం తీసుకున్న భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి బిజెపి ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్ కృతజ్ఞతలు తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆల్విన్ ఎక్స్ రోడ్ వీఆర్ అశోక్ గ్రాండ్ లో బిజెపి ఓబీసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నాగేశ్వర్ గౌడ్ అధ్యక్షతన ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలే భాస్కర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు నందనం దివాకర్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, మువ్వా సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలే భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీసీ లకు రూ. 2500 కోట్లు, నాయి బ్రాహ్మణ, రజకులకు రూ. 250 కోట్లు చొప్పున కేటాయించి ఖర్చు చేయలేదన్నారు. సెలూన్ షాపులకు, దోభి ఘాట్ లకు ఉచిత కరెంట్ హామీని ఇస్తానని చెప్పి నేటికి అమలు చేయలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్ ని టీఆర్ఎస్ ప్రభుత్వం 23 శాతానికి తగ్గించి బీసీలకు అన్యాయం చేసిందన్నారు. సీఎం కేసీఆర్ వెంటనే బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ని అమలు చేయాలని తీర్మాణం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సింగ్ రావు, మహేష్ యాదవ్, సత్యనారాయణ, రాజు, వెంకటేష్, దశరథ్ సాగర్, పృథ్వి కాంత్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.