నమస్తే శేరిలింగంపల్లి: కరోనా వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. హాఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 12 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయస్సు గల వారికి ప్రత్యేక కొవిడ్ టీకా కార్యక్రమాన్ని మాదాపూర్, హఫీజ్ పేట్ డివిజన్ల కార్పొరేటర్లు వి.జగదీశ్వర్ గౌడ్, పూజిత గౌడ్ తో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ ప్రారంభించారు. ప్రజలందరూ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న కోవిడ్ వాక్సినేషన్ తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగ పర్చుకోవాలని అన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరు అందుబాటులో ఉన్న టీకా సెంటర్లలోకి వెళ్లి టీకా వేయించుకోవలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలింగ్ యాదగిరి గౌడ్, హఫీజ్ పెట్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, కృష్ణ ముదిరాజ్, గౌరవ అధ్యక్షుడు వాలా హరీష్ రావు, లక్ష్మా రెడ్డి, వార్డు సభ్యులు కనకమామిడి వెంకటేష్ గౌడ్, రామకృష్ణ గౌడ్, సయ్యద్ తయేర్ హుస్సేన్, జామీర్, సయ్యద్ సాబేర్, రవీందర్ రెడ్డి, దామోదర్ రెడ్డి,పద్మ రావు,వెంకటేశ్వర రావు,వేణు గోపాల్, రఘువీర, వెంకట్ రెడ్డి, కిషన్ రావు, చాంద్ పాషా, మహిళలు షేబానా, కట్టున్ బీ, పద్మ తదితరులు పాల్గొన్నారు.