నమస్తే శేరిలింగంపల్లి: విశాఖ శ్రీ శారదా పీఠ పరిపాలిత చందానగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సముదాయంలోని శ్రీ భవాని శంకరాలయ ద్వావింశతి (22వ) శివోత్సవాలలో రెండో రోజు ఆదివారం ఘనంగా పూజలు నిర్వహించారు. ఉదయం 10 గంటలకు శ్రీ భవాని శంకర స్వామి కళ్యాణోత్సవం, మధ్యాహ్నం అన్నదానం నిర్వహించారు. నిత్య హోమము, గజవాహన సేవ తదితర పూజా కార్యక్రమాలు చేపట్టారు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు జగద్గురు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, ఉత్తర పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి వార్ల దివ్యాశీస్సులతో 24వ తేదీ వరకు శివోత్సవములు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు.
