నమస్తే శేరిలింగంపల్లి: కాలనీలలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించి అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్ కాలనీలో రూ. 35 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణం పనులను చందానగర్ డివిజన్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణం పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చూడాలని కాంట్రాక్టర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు డీ ఈ స్రవంతి, వర్క్ ఇన్‌స్పెక్టర్ హరీష్ , జగన్, టిఆర్ఎస్ నాయకులు వరలక్ష్మి రెడ్డి, రవిందర్ రెడ్డి, దాసు, దీక్షీత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
