నమస్తే శేరిలింగంపల్లి: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్ హఫీజ్ పెట్, చందానగర్, భారతి నగర్ డివిజన్ (పార్ట్) డివిజన్ల పరిధిలో అర్హులైన 232 మంది లబ్దిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం ద్వారా మంజూరైన రూ. 2 కోట్ల 32 లక్షల 26 వేల ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ గాంధీ అందజేశారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పథకాలు, సంక్షేమ ఫలాలు రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఏదో ఒక రూపంలో లబ్ది పొందుతున్నాయని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాస రావు, పూజిత జగదీశ్వర్ గౌడ్, మంజుల రఘునాథ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు సాయిబాబా, రంగారావు, శేరిలింగంపల్లి తహశీల్దార్ వంశీ మోహన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.