యువతను పట్టించుకోకుండా జన్మదినోత్సవాలు జరుపుకోవడం విడ్డూరం – బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషిచేసిన యువతను పట్టించుకోకుండా మూడు రోజులు జన్మదినం జరుపుకోవడం విడ్డూరంగా ఉందని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ జన్మదినాన్ని నిరుద్యోగ దినంగా ప్రకటిస్తూ వివేకానంద నగర్ డివిజన్ కూకట్ పల్లిలో బిజెపి నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టి స్వామి వివేకానంద విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు.

వివేకానంద నగర్ ‌డివిజన్ లో కేసీఆర్ కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న‌ బిజెపి నాయకులు

ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగం అని విద్యార్థులను మోసం చేసి ఎనిమిదేళ్ల పాలనలో ఎలాంటి నోటిఫికేషన్స్ ఇవ్వకుండా నిరుద్యోగులుగా మార్చారని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా కల్వకుంట్ల కుటుంబానికే ఉద్యోగాలు దక్కాయని దుయ్యబట్టారు. రాబోయే రోజుల్లో యువత సరైన గుణపాఠం చెబుతారని ఎద్దేవా చేశారు. తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్స్ ను విడుదల చేయాలని, నిరుద్యోగ భృతిని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నర్సింగ్ రావు, భూపాల్ రెడ్డి, నర్సింగ్ యాదవ్, సీతారామరాజు, రాధా కృష్ణ యాదవ్, బాలు యాదవ్, రాజిరెడ్డి ,శ్రీధర్, సాయి, ఉపేందర్, మనోజ్, మురళి, కృష్ణ, శ్రీకాంత్ యాదవ్, రాజు, లలిత, మమత తదితరులు పాల్గొన్నారు.

వివేకానంద విగ్రహానికి‌‌ వినతి‌ పత్రాన్ని అందజేసిన‌ రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here