నమస్తే శేరిలింగంపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలను పట్టించుకోకుండా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను వైభవంగా జరుపుకోవడం సిగ్గుచేటని మేడ్చల్ అర్బన్ జిల్లా మహిళా మోర్చా సెక్రటరీ విద్యాకల్పన ఏకాంత్ గౌడ్ అన్నారు. వివేకానంద నగర్ డివిజన్ లోని వెంకటేశ్వర నగర్ జిల్లా ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యాకల్పన మాట్లాడుతూ సీఎం జన్మదిన వేడుకలు మూడు రోజులు అట్టహాసంగా జరుపుతున్న ప్రజాప్రతినిధులు పాఠశాలలో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు.
ప్రభుత్వ హాస్టళ్లలో నూకల బియ్యం సరఫరా చేయాలని జారీ చేసిన జీఓను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలలో తాగునీటి వసతి లేక విద్యార్థులు సంపులోని నీటిని తాగుతున్నారని ఆవేదన చెందారు. పాఠశాలలో కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి విద్యాకల్పన ఏకాంత్ గౌడ్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ అధ్యక్షుడు డి. నర్సింగ్ రావు, బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏకాంత్ గౌడ్, జిల్లా ఎస్సీ మోర్చా సెక్రెటరీ అశోక్, జిల్లా బిజెపి కార్యవర్గ సభ్యులు గణేష్ గౌడ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి మనోజ్, డివిజన్ సెక్రెటరీలు, దయాకర్ రెడ్డి, జితేందర్, భాను యాదవ్, మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు మంజుల, కార్యవర్గ సభ్యురాలు షాలిని, విశాల తదితరులు పాల్గొన్నారు.