అన్ని విధాలుగా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు కృషి

  • కార్పొరేటర్ హమీద్ పటేల్

కొండాపూర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్రజలు కోరుకునే విధంగా మౌలిక వసతులను కల్పించి అన్ని విధాలుగా వారి సమస్యలు తీర్చటానికి కృషి చేస్తున్నామని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాజ‌రాజేశ్వరి కాలనీలో రూ.19.5 లక్షల‌ అంచనా వ్యయంతో, పాన్ మక్తాలో రూ.26 లక్షల‌ అంచనా వ్యయంతో చేప‌ట్టిన‌ అంతర్గత రోడ్ల పనులను స్థానిక నాయకులు, కాలనీవాసులతో కలసి కార్పొరేటర్ హమీద్ పటేల్ పర్యవేక్షించారు.

సీసీ రోడ్డు ప‌నుల‌ను ప‌రిశీలిస్తున్న కార్పొరేటర్ హమీద్ పటేల్

ప్రతి కాలనీ, బస్తీలో మౌలిక వసతులు కల్పనకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ పనులను యుద్ధప్రాదిపదికన చేయిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు ఉన్నా తన‌ దృష్టికి తీసుకువస్తే తన వంతుగా సాధ్యమైనంత వరకు పరిష్కరించడానికి కృషి చేస్తానని అన్నారు. ప్రజలకు, వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రోడ్ల నిర్మాణం చేపట్టాలని, పనులలో నాణ్యత ప్రమాణాలను పాటించాలని కాంట్రాక్టర్ కు సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో రాజ‌రాజేశ్వరి కాలనీ అధ్యక్షుడు విజయ్ కృష్ణ, ఉపాధ్యక్షులు మధు ముదిరాజ్, రమేష్ ముదిరాజ్, అజయ్ సింగ్, పాన్ మక్తా యువ నాయకులు చిన్నా గౌడ్, ప్రవీణ్ గౌడ్, రాంబాబు, కాంట్రాక్టర్ చంద్రయ్య, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here