నమస్తే శేరిలింగంపల్లి: పుల్వామా దాడిలో అసువులు బాసిన అమరవీర జవాన్లను దేశం ఎన్నటికీ మరవదని శేరిలింగంపల్లి యువనాయకులు అఖిల్, రాజీవ్ అన్నారు. మూడేళ్ల క్రితం జరిగిన పుల్వామా దాడిలో మరణించిన 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లకు పలువురు యువకులు అశ్రునివాళి అర్పించారు. చందానగర్ డివిజన్ లోని అన్నపూర్ణ ఎన్ క్లేవ్ నుంచి గాంధీ విగ్రహం వరకు జై జవాన్, అమర్ రహే అంటూ నినాదాలు చేస్తూ క్యాండిల్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి యువనాయకులు అఖిల్, రాజీవ్, మస్తాన్, లోకేష్, నిఖిల్, పవన్, అలిగేరి అర్జున్ రావు, విజయ్, దినేష్, కళ్యాణ్, వెంకీ, బోధయన్, వేణు, సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.