కేసీఆర్ జన్మదిన వేడుకలు ప్రారంభం – మొదటి రోజు అపరభగీరథుని పేరిట టీఆర్ఎస్ శ్రేణుల అన్నదానం

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తనదైన రీతిలో విశేష సేవలందిస్తున్న స్పూర్తి ప్రదాత, అపరభగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను రాష్ట్రంలో మూడు రోజుల పాటు సామాజిక సేవలు చేస్తూ జరపుకోవాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అన్నదానం, పండ్ల పంపిణీ కార్యక్రమాలను చేపట్టారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ అశ్రయ వృద్ధాశ్రమంలో, వివేకానంద సేవ సంఘం వృద్ధాశ్రమంలో కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాస రావు తో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి ‌గాంధీ వృద్ధులకు అన్నదానం వడ్డించి పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజావసరాలు తెలిసిన వ్యక్తి అని, ఏ రాష్ట్రంలో చేయని అభివృద్ధి మన రాష్ట్రంలో చేశారన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినోత్సవాల‌ను ప్రజా సేవ చేస్తూ మూడు రోజుల పాటు జరుపుకోవాలని మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మొదటి రోజున అన్నదానం కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్, హఫీజ్ పేట్ డివిజన్ల అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బాలింగ్ గౌతమ్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు దామోదర్ రెడ్డి, వీరపనేని శ్రీనివాస్, బిఎస్ఎన్ కిరణ్ యాదవ్, వెంకటయ్య యాదవ్, సత్యనారాయణ, సదా బాలయ్య, అప్పిరెడ్డి, రావూరి శ్రీనివాస్, అష్రఫ్, సత్తార్, పప్పు షరీఫ్, సదా దానయ్య, హమీద్, సుధాకర్ రెడ్డి, అనీల్, కృష్ణ కుమారి, సదా మాధవి, గంగాధర్, ప్రతాప్ రెడ్డి, చంద్రిక ప్రసాద్ గౌడ్, గోపారాజు శ్రీనివాస్ రావు, వజీర్, సుప్రజా శ్రీనివాస్, శంకర్ నాయక్ స్వామి, కృష్ణ, కమలాకర్, ఉమా, సుధాకర్ రమేష్, ప్రసన్న రెడ్డి, రమేష్, వెంకటేష్, జేమ్స్, టి ఎన్ నగర్ రమేష్, రాణి, లత తదితరులు ఉన్నారు.

మియాపూర్ లోని ఆశ్రయ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేసిన ప్రభుత్వ విప్ గాంధీ

16 న మెగా రక్తదాన శిబిరం
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని టీఆర్ఎస్ శ్రేణులంతా 16వ తేదీన బుధవారం ఉదయం 10 గంటలకు నిర్వహించను‌న్న రక్తదాన శిబిరంలో పాల్గొనాలని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా రెండో రోజు కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ శిబిరంలో నియోజకవర్గం లోని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కేసిఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

వివేకానంద సేవా సంఘం వృద్ధాశ్రమంలో పండ్ల ను పంపిణీ చేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ,

పూజిత జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో..

ముఖ్య మంత్ర కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు సంకల్ప ది హోమ్ ఫర్ ఆర్ఫన్ స్టూడెంట్స్ అనాథ ఆశ్రమంలో పిల్లలకు హఫీజ్ పెట్ కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్ మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. బడుగు బలహీన వర్గాలకు అండగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, మన తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్ అన్నారు.

అనాథశ్రమంలో పిల్లలకు భోజనం వడ్డిస్తున్న హఫీజ్ పేట్ కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్

హమీద్ పటేల్ ఆధ్వర్యంలో..
కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొండాపూర్ ఏరియా హాస్పిటల్ లో స్థానిక కార్పొరేటర్ హమీద్ పటేల్ ముఖ్యమంత్రి జ‌న్మదినోత్సవ సందర్భంగా రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు.‌
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ
ప్రాణాలకు తెగించి కొట్లాడి స్వరాష్ట్రాన్ని సాధించిన గొప్ప యోధుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. అభివృద్ధి ఫలాలను ప్రజలకు చివరి వరకు అందేలా వ్యవస్థను తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు. కేసీఆర్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో, రాష్ట్ర ప్రగతిని మున్ముందుకు తీసుకోపోవాలని కార్పొరేటర్ హమీద్ పటేల్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొండాపూర్ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. వరదాచారి, కొండాపూర్ డివిజన్ అధ్యక్షుడు అబ్బుల కృష్ణగౌడ్, జనరల్ సెక్రటరీ పేరుక రమేష్ పటేల్, సెక్రటరీ జె. బలరాం యాదవ్, సీనియర్ నాయకులు అన్నం శశిధర్ రెడ్డి, రూప రెడ్డి, తాడెం మహేందర్, శ్రీరామ్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి, న్యూ పీజేఆర్ నగర్ ప్రెసిడెంట్ వెంకటి, తిరుపతి యాదవ్, కృష్ణ సాగర్, సాయి శామ్యూల్ కుమార్, గణపతి, డా. మల్లేష్, డా. రమేష్, మంగమ్మ, శ్యామల, గిరి గౌడ్, యాదగిరి, వెంకట్ రెడ్డి, కాశెట్టి అంజి, సయ్యద్ ఖాసీం, వివి రావు, షేక్ రఫీ, ఎస్వీయన్ రాజు, తదితరులు పాల్గొన్నారు.

కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేస్తున్న కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here