నమస్తే శేరిలింగంపల్లి: ప్రమాదవశాత్తు ఐదంతస్తుల భవనం పై నుంచి పడి ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం నెల్లూరుకు చెందిన మన్నం లక్ష్మీ ప్రసాద్ (62) హైదరాబాద్ కు వచ్చి గోకుల్ ప్లాట్ లో నివసిస్తున్న తన బావ వద్ద ఉంటున్నాడు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఐదంతస్థుల భవనం పై నుంచి లక్ష్మీ ప్రసాద్ ప్రమాదవశాత్తు కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మణికొండలో నివాసం ఉంటున్న మృతుని అల్లుడు భీమవరపు దిలీప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.