నమస్తే శేరిలింగంపల్లి: నేటి సమాజంలో హక్కుల గురించి ప్రతి ఒక్కరిలోనూ అవగాహన కలిగి ఉండాలని ప్రపంచ మానవ హక్కుల సంఘం జాతీయ చైర్మన్ ఎం.సుబ్బారెడ్డి అన్నారు. మియాపూర్ లోని బి కే ఎన్ క్లేవ్ లో తెలంగాణ రాష్ట్ర చైర్మన్ తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో హక్కులపై అవగాహన సదస్సు, నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ చైర్మన్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ హక్కుల ఉల్లంఘన జరిగితే ఉపేక్షించేది లేదని, హక్కుల పరంగా ఎలాంటి సమస్య వచ్చినా ప్రపంచ మానవ హక్కుల సంఘం సభ్యులను ఆశ్రయిస్తే తప్పకుండా వారికి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. ప్రపంచ మానవ హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర చైర్మన్ తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి మాట్లాడుతూ సమస్య ఏదైనా, ఏ ప్రాంతానికి చెందినదైనా కావచ్చు ప్రజల హక్కుల పరంగా ఎక్కడ అన్యాయం జరిగినా ప్రపంచ మానవ హక్కుల సంఘం ముందుంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రాథమిక హక్కులను తెలుసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగ చైర్పర్సన్ రేసు స్వప్న మాట్లాడుతూ ఇటీవల కాలంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు చాలా దారుణమని, మహిళల హక్కుల పై పోరాటం సాగించేందుకు ముందుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ ఏ. జంగారెడ్డి, తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ కొండా సంతోష్ కుమార్, స్టేట్ సెక్రటరీ రేపాల అవినాష్, స్టేట్ జనరల్ సెక్రెటరీ రంకు గౌర్, ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ దండ సంపత్ రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా చైర్మన్ పోగుల నరసింహ, వరంగల్ జిల్లా చైర్మన్ జనార్ధన్, మహిళా విభాగం రంగారెడ్డి జిల్లా చైర్ పర్సన్ చల్ల గీతారెడ్డి, గ్రేటర్ వరంగల్ జిల్లా చైర్ పర్సన్ గుంరెడ్డి సునీత, యాదాద్రి భువనగిరి జిల్లా చైర్పర్సన్ రమణ, సురేష్ ప్రజాపతి, సాయి కుమార్ గౌడ్, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.