నమస్తే శేరిలింగంపల్లి: మెరుగైన జీవన ప్రమాణాల కోసం, ట్రాఫిక్ రహిత సమాజం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని శ్రీదేవి థియేటర్ నుండి అమీన్ పూర్ వరకు చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులను స్థానిక కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి, జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం, టౌన్ ప్లానింగ్ అధికారుల తో కలిసి మంగళవారం ప్రభుత్వ విప్ గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ రోడ్డు నిర్మాణంతో
సమస్య తీరనున్నట్లు చెప్పారు. ఎలక్ట్రికల్ స్తంభాలు స్థాన భ్రంశం త్వరితగతిన చేపట్టాలని ఎలక్ట్రికల్ అధికారులకు ఆదేశించారు. రద్దీ ప్రాంతంలో ప్రజల సౌకర్యార్థం అన్ని హంగులతో రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలన్నారు. రోడ్డు విస్తరణ పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని ఎమ్మెల్యే గాంధీ సూచించారు. రోడ్డు విస్తరణ పనులపై అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. రద్దీ ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్య తగ్గించడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేసి అనేక ప్లై ఓవర్ లు, రోడ్లు, లింక్ రోడ్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వ విప్ గాంధీ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ శంకర్ నాయక్, ఈఈ శ్రీకాంతిని, ఏఈ రమేష్, టౌన్ ప్లానింగ్ అధికారులు శేరిలింగంపల్లి డిప్యూటీ సిటీ ప్లానర్ గణపతి, టీపీఎస్ రవీందర్, ఎలక్ట్రికల్ ఏఈ రాజ్ కుమార్, మాజీ కౌన్సిలర్ లక్ష్మీ నారాయణ గౌడ్, డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, నాయకులు జనార్దన్ రెడ్డి, గురు చరణ్ దూబె, దాస్, హరీష్ రెడ్డి, కార్తిక్ గౌడ్, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.