నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని కుమ్మరి బస్తీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను త్వరితగతిన చేపట్టేలా చర్యలు తీసుకోవాలని గంగారం శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయ కమిటీ సభ్యులు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ని కోరారు. ఈ మేరకు పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. గంగారం పోచమ్మ దేవాలయం నుండి భక్తాంజనేయ స్వామి దేవాలయానికి వచ్చే భక్తులు, ప్రజలు జాతీయ రహదారి దాటేందుకు వీలుగా జిబ్రా లైన్స్ ఏర్పాటు చేయాలని కోరారు. జీబ్రా లైన్ వేయడంతో పాటు ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే గాంధీ సానుకూలంగా స్పందించారు. కుమ్మరి బస్తీ కాలనీలో నెలకొన్న మంచినీటి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని చెప్పారు. కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, గంగారం శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయ కమిటీ సభ్యులు, మాజీ ప్రెసిడెంట్ దొంతి శేఖర్ ముదిరాజ్, అధ్యక్షులు మిరుదొడ్డి రాజేందర్, ప్రధాన కార్యదర్శి గుంటూరి భుజంధర్, కోశాధికారి గోపి ముదిరాజ్, కమిటీ మెంబర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.