నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేద వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని బసవతారక నగర్ లో ఇటీవల గుడిసెలు కోల్పోయిన బాధితులకు మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజేంద్రనగర్ ఆర్డీఓ చంద్రకళ, తహశీల్దారు వంశీ మోహన్, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా తో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ చేతుల మీదుగా 50 మందికి ఇళ్ల మంజూరీ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బసవతారక నగర్ లో ఇటీవల గుడిసెలు కోల్పోయిన బాధితులు తమకు సరైన న్యాయం చేయాలని, కొందరు కోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చారన్నారు. కోర్టు పరిధిలోని స్టే తో మాకు ఎలాంటి సంబంధం లేదని, తమకు ఇళ్లు ఇప్పించేందుకు కోర్టు స్టే అడ్డంకిగా మారిందని, తమకు ఇళ్లను కేటాయించి న్యాయం చేయాలని కొంతమంది వినతిపత్రం అందజేశారని అన్నారు. బాధితుల వినతి మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ కు స్థానిక మాజీ కార్పొరేటర్ సాయి బాబా తో కలిసి సమస్య విన్నవించగా అర్హులైన ప్రతి లబ్ధిదారునికి గృహ నిర్మాణ పథకాలలో ఇంటిని మంజూరు చేస్తూ మంజూరు పత్రాలను జారీ చేయడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, మండల సర్వేయర్ మహేష్, సీనియర్ అసిస్టెంట్ చంద్రారెడ్డి, ఆర్ఐ శ్రీకాంత్, సీనయ్య, గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షులు రాజు నాయక్, టిఆర్ఎస్ నాయకులు సురేందర్, రాగం జంగయ్య యాదవ్, అంజమ్మ, శంకరి రాజు ముదిరాజ్, జగదీష్, రమేష్ గౌడ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.