నమస్తే శేరిలింగంపల్లి: ఓమిక్రాన్ కరోనా మూడో ముప్పు సమీపిస్తున్న దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి సూచించారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చందానగర్ డివిజన్ పరిధిలోని నారాయణ కాలేజీలో 15–18 సంవత్సరాల వయస్సు వారికి ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి హాజరై ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు. కరోనా వ్యాక్సినేషన్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, టిఆర్ఎస్ నాయకులు లక్ష్మీనారాయణ గౌడ్, జనార్దన్ రెడ్డి, హెల్త్ ఆఫీసర్ స్వామి, కాలేజీ ప్రిన్సిపాల్ ఫణి, ఏఓ నగేష్, సురేష్, అమిత్ తదితరులు పాల్గొన్నారు.