సత్యనారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

నమస్తే శేరిలింగంపల్లి: సామాజిక‌ సేవా కార్యక్రమాల్లో సత్యనారాయణ సేవా సమితి ఎల్లప్పుడూ ముందుంటుందని సేవా సమితి చైర్మన్ మారబోయిన అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. మసీద్ బండలోని కొండాపూర్ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సత్యనారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో ఆలీవ్ ఆస్పత్రి వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. చైర్మన్ మారబోయిన అనిల్ కుమార్ యాదవ్ పాల్గొని ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ‌ఆయన మాట్లాడుతూ పేదలకు సేవ చేయడంలో ఉన్న సంతృప్తి మరెందులోనూ లేదన్నారు. సత్యనారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ఉచిత‌ వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. మున్ముందు మరిన్ని కార్యక్రమాలు చేపడుతామని అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో సభ్యులు మల్లేష్ గౌడ్, సామ్యుల్ కార్తీక్, రోహిత్ యాదవ్ తదితరులు ఉన్నారు.

శిబిరంలో పాల్గొన్న వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న ఆలీవ్ హాస్పిటల్ సిబ్బంది
శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతున్న సత్యనారాయణ సేవా సమితి చైర్మన్ మారబోయిన అనిల్ కుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here