నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని అన్ని కాలనీల్లో మౌళిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పేర్కొన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎంఏ నగర్ కాలనీలో నూతనంగా చేపట్టిన సీసీ రోడ్డు పనులను మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని ప్రతీ కాలనీ, బస్తీలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని,డివిజన్ పరిధిలో మంజూరైన అభివృధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీక్రాంతి, డీఈ స్రవంతి, ఏఈ దీరజ్, వర్క్ ఇన్స్పెక్టర్ ప్రేమ్, స్థానిక నాయకులు, లసాని రాజు, రాజు గౌడ్, విజయ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.