నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీ అభివృద్ధికి కృషి చేస్తామని, తమ దృష్టికి వచ్చే ప్రతి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని మాతృశ్రీ నగర్ లో కాలనీ అసోసియేషన్ సభ్యులు, నాయకులతో కలిసి నూతనంగా చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పనులను స్థానిక కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పరిశీలించారు. అనంతరం కాలనీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై కాలనీ వాసులతో సమీక్షించారు. దశల వారీగా సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాతృశ్రీ నగర్ కాలనీ అధ్యక్షులు కావూరి అనిల్ కుమార్, శ్రీనివాస్ రాజు, రవి, శర్మ వల్లి తదితులు ఉన్నారు.