నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, రాష్ట్రంలో టీఆర్ఎస్ పని అయిపోయిందని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ అన్నారు. మియాపూర్ మక్తా సెంటర్ లో ఆర్ కె వై టీం సభ్యుల ఆధ్వర్యంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వంద మంది నాయకులు బిజెపి పార్టీలోకి చేరారు. వీరికి బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని దుర్మార్గపు ప్రభుత్వం హయాంలో పేదలకు ఒరిగిందేమి లేదని ఎద్దేవా చేశారు. దొరలు చేస్తున్న అవినీతి, అక్రమాలు ఒక ఎత్తయితే ఇక్కడి స్థానిక ఎమ్మెల్యే, స్థానిక కార్పొరేటర్ ఇద్దరూ కలిసి దొరికినంత దోచుకో అన్నట్టు మారారని అన్నారు.
ఎక్కడ చూసినా కబ్జాల పర్వమే కొనసాగుతోందని వాపోయారు. పేద ప్రజల సమస్యలు పట్టని ఇలాంటి ప్రజాప్రతినిధులు అవసరమా అని ప్రశ్నించారు. రోబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ మరింత బలపడనుందని, క్షేత్ర స్థాయిలో బలోపేతానికి పడుతున్న కష్టానికి మూడింతలు కష్టపడాలని బిజెపి కార్యకర్తలకు రవికుమార్ యాదవ్ సూచించారు. బిజెపి పట్ల ఆకర్శితులై అన్ని వర్గాల ప్రజలు మున్ముందు పెద్ద ఎత్తున పార్టీలోకి చేరికలు ఉంటాయని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ కి ఎక్స్పెయిరీ డేట్ దగ్గరలోనే ఉందని చెప్పారు. మోడీ నాయకత్వంలో బిజెపి లోని ప్రతీ కార్యకర్తకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అన్నారు. రాబోయే ఎన్నికల్లో శేరిలింగంపల్లి గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. డివిజన్ నాయకులు రాఘవేంద్ర రావు, నాగేశ్వర్ గౌడ్, జ్ఞానేంద్ర ప్రసాద్, మాణిక్, లక్ష్మణ్, ఆర్ కె వై టీం సభ్యులు గణేష్, వినోద్ యాదవ్, శ్రీను, రాము, డివిజన్ నాయకులు, బిజెపి కార్యకర్తలు పాల్గొనగా బిజెపిలోకి చేరిన వారిలో దినేష్ ముదిరాజ్, కె. సురేష్, నాగులు, జాన్, హరి చందర్, దుర్గారావు, లక్ష్మణ్ రావు, అనిత, నిలకంఠం, జి మల్లేశ్, జి రవి ,వెంకటేష్ రంగరాజు, రంగారెడ్డి, శ్యామ్,నాయుడు, వీరితో పాటు మరో వందమంది ఉన్నారు.