నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో కొనసాగుతున్న ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళాలో వివిధ రాష్ట్రాల నుండి దాదాపుగా 500 స్టాల్స్ సందర్శకులకు అందుబాటులో ఉన్నాయి. వుడ్ కార్వింగ్, టెర్రకోట, చేనేత వస్త్రాలు, హస్తకళలు ఉత్పత్తులు సందర్శకులనువ
ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వేంకటగిరి పట్టు చీరలపై కలంకారీ ప్రింట్ సారీస్, ఝాముడని, బండారులంక చీరలు, కోట సారీస్, మహేశ్వరం, మధుబని పెయింటింగ్, పాతచిత్ర పెయింటింగ్, ఆయిల్ పెయింటింగ్స్, గుజరాత్ బ్యాగ్స్, వాల్ హ్యాంగింగ్స్, ఆర్టిఫిషల్ జ్యువలరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శేషం రమణ తన శిష్య బృందంచే వేణువు గాత్ర కచేరి ఆధ్యంతం అలరించింది. కేరళ నుండి విచ్చేసిన ప్రముఖ కూచిపూడి నృత్య గురువులు అనుపమ మోహన్ శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలో బ్రహ్మాంజలి, గణపతి స్తుతి, స్వాతి తిరుణాల్ కృతి, మొహినియాట్టం పదం కన్నప్ప చరితం, ఓం నమఃశివాయ అంశాలను ప్రదర్శించారు. డాక్టర్ మైథిలి అనూప్ శిష్య బృందం ప్రదర్శించిన మొహినియాట్టం ప్రదర్శన ఆధ్యంతం అలరించింది.