అభివృద్ధి పేరుతో కాలయాపన చేయడం సరికాదు- బిజెపి రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కర రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి:శేరిలింగంపల్లి నియోజవర్గం పరిధిలోని గంగారం పెద్ద చెరువు అభివృద్ధికి విడుదలైన నిధులు, పెట్టిన ఖర్చులపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని బిజెపి రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. బిజెపి రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యుడు గూడూరి త్రినాథ్ ఆధ్వర్యంలో శ్రీరాంనగర్ లో ఏర్పాటు చేసిన బిజెపి జెండాను కసిరెడ్డి భాస్కర రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా అభివృద్ధి పేరుతో కాలయాపన చేస్తున్నారని అన్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని, అప్పుడే నిజానిజాలు ప్రజలకు తెలిసే అవకాశం ఉందని అన్నారు. నాలుగేళ్ల నుంచి చెరువులో నీరు లేకపోవడంతో 3 కి.మీ పరిధిలో బోర్లు ఎండిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు పట్టడం లేదన్నారు. మాజీ కౌన్సిలర్ రాఘవేంద్రరావు, నాగం రాజశేఖర్ మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో పాలకులు కాలయాపన చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వాపోయారు. ప్రాధాన్యతా క్రమంలో పనులు చేయకుండా, ప్రజాధనాన్ని ఇష్టారీతిగా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బిజెపి చందానగర్ డివిజన్ నాయకులు కసిరెడ్డి సింధూ రఘునాథ్ రెడ్డి, రాకేష్ దూబే, డివిజన్ అధ్యక్షుడు జి. రాంరెడ్డి, శివకుమార్ వర్మ, శ్రీనివాస్, ఆంజనేయులు, నందనం వినయ, రఘునాథ్ రెడ్డి, రాజ్ జైశ్వాల్, వేణుగోపాల్, మధుసూదనరావు, అమరేంద్ర ప్రతాప్ సింగ్, మురళి, రాజేందర్ రెడ్డి, కిషన్, మూర్తి, అగస్టిన్, రమేష్, దేవమని యాదవ్, చందు, కుమారస్వామితో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

శ్రీ రాం నగర్ బిజెపి జెండాను ఆవిష్కరిస్తున్న రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కర రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here