ప్లై ఓవర్ బ్రిడ్జి పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని టోలి చౌకి గెలాక్సీ థియేటర్ నుండి రాయదుర్గం మల్కం చెరువు వరకు రూ. 333.55 కోట్ల అంచనావ్యయంతో 2.71 కి.మీ ల మేర కొత్తగా నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ రద్దీ ఉండే ప్రాంతాలలో, చుట్టు ప్రక్కల ప్రాంతాల ప్రజల సౌకర్యార్థం సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని హంగులతో, నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని అన్నారు. అన్ని హంగులతో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేసి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ నెల 26 లేదా 27 తేదీలలో ప్రారంభించుకోనున్నట్లు తెలిపారు. కొండాపూర్ ఫ్లై ఓవర్ అక్టోబర్ నెలల లో ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు. మెరుగైన జీవన ప్రమాణాల కోసం ట్రాఫిక్ రహిత సమాజం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపడుతుందని అన్నారు. ఎస్ ఆర్ డీ పీ ప్రాజెక్ట్ లో భాగంగా తొలి ఫలితంగా అయ్యప్ప సొసైటీ అండర్ పాస్ ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ సాయి బాబా, నాయకులు దారుగుపల్లి నరేష్, సంపత్, కాశీనాథ్ యాదవ్, సల్లావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

ప్లై ఓవర్ బ్రిడ్జి పనులను పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here