పేదలకు అండగా నిలుస్తున్న కేసీఆర్ పథకాలు – కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీలో ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. కళ్యాణ లక్ష్మీ, షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన రూ. 5 లక్షల చెక్కులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అందజేశారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కేసీఆర్ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు. కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ లతో పేదింటి అమ్మాయిల కళ్లల్లో సంతోషం నిండుకుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నార్నె శ్రీనివాస రావు, ఉప్పలపాటి శ్రీకాంత్, టీఆర్ఎస్ నాయకులు జిల్లా గణేష్, కాశీనాథ్ యాదవ్, అంజనేయులు, శ్రీనివాస గోపరాజ్, శ్రావణి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేస్తున్న ప్రభుత్వ విప్‌ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here