నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా పదవీబాధ్యతలు చేపట్టిన తిరుపతి రావును నడిగడ్డ గిరిజన సంక్షేమ సంఘం సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నడిగడ్డ గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు తిరుపతి నాయక్, ఉపాధ్యక్షులు, టీఆర్ఎస్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు స్వామి నాయక్, అధ్యక్షులు హనుమానాయక్, మోహన్ నాయక్, సుధాకర్, సూర్య నాయక్ తదితరులు సీఐ తిరుపతి రావు కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.