నమస్తే శేరిలింగంపల్లి: విశ్వహిందూ పరిషత్ తెలంగాణ ఆధ్వర్యంలో భాగ్యనగర్ ఎల్ బి స్టేడియంలో నిర్వహించిన లక్ష యువగళ గీతార్చన కార్యక్రమానికి శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి బిజెపి, అనుబంధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. తారనగర్ తుల్జా భవాని మాత దేవాలయం నుండి మొదలైన బైక్ ర్యాలీ చందానగర్, మియాపూర్, కూకట్ పల్లి, మూసాపేట్ మీదుగా భాగ్యనగర్ ఎల్ బి స్టేడియం వరకు బైక్ ర్యాలీగా వెళ్లారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ బైక్ ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. రాజకీయ పార్టీలతో ప్రమేయం లేకుండా కుల-మత- జాతి -వర్ణ భేదాలు పాటించకుండా సిద్ధాంతాలు- రాద్ధాంతాలు ప్రక్కనపెట్టి హిందువును అనే పవిత్రమైన భావనతో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పెద్ద ఎత్తుమ పాల్గొన్నారని తెలిపారు. ఎల్ బీ స్టేడియంలో నిర్వహించిన లక్ష యువగళ గీతార్చన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గోవింద్ దేవ్ గిరి మహరాజ్, చినజీయర్ స్వామి, విశ్వప్రసన్న తీర్థ స్వామి పాల్గొని పలు సందేశాలను అందించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వి హెచ్ పి, భజరంగ్ దళ్, బిజెపి నాయకులు, సంఘ్ పరివార్ సభ్యులు రమేష్, జనార్ధన్, కృష్ణ, రాఘవేంద్ర, రఘునాథ్ యాదవ్, బాలాజీ, హరి, మాణిక్ రావు, నారాయణరెడ్డి, చందు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
