బిపిన్ రావత్ మరణం తీరనిలోటు : బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్

నమస్తే శేరిలింగంపల్లి: భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ అకాల మరణం తీరని లోటని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీ వద్ద బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ భారత తొలి సిడిఎస్ రంగంలో అత్యంత శక్తివంతమైన సైనిక అధికారిగా గుర్తింపు పొందిన భారత చీఫ్ ఆప్ డిఫెన్స్ స్టాప్ బిపిన్ రావత్ అకాల మరణం భారత దేశానికి తీరని లోటని అన్నారు. భారతమాత యుద్ధవీరుడు భారతదేశానికి ఎన్నో సేవలు అందించిన గొప్ప సైనిక దళపతి 4 దశాబ్దాలకు పైగా భారతమాత సేవలో తరలిస్తున్న మేరునగ శిఖరం కూలిపోయిందని వాపోయారు. ఆయనతో పాటు 11 మంది వీర జవాన్లకు నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు శ్రీధర్ రావు, కోటేశ్వరరావు, కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు దామోదర్ రెడ్డి, సభ్యులు వెంకటరెడ్డి, ప్రసాద్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

బిపిన్ రావత్ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here