వివాహం‌ కావాల్సిన వరుడు అదృశ్యం

నమస్తే శేరిలింగంపల్లి: కొద్ది రోజుల్లో వివాహం‌ కావాల్సిన ఓ వరుడు అదృశ్యమైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చందానగర్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం గాజులగూడెంకు చెందిన పి. మల్లేశం ప్రైవేటు ఉద్యోగం చేస్తూ చందానగర్ లోని చిన్నారెడ్డి ఆస్పత్రి సమీపంలో నివాసం ఉంటున్నాడు. మల్లేశంకు తన మేనమామ కూతురు మహేశ్వరీతో వివాహ నిశ్చితార్థం జరిగి కొన్ని కారణాల వల్ల వివాహం రద్దయింది. కొన్ని రోజులకే హవేలి ఘనపూర్ చెందిన మరో అమ్మాయితో మల్లేశంకు వివాహ నిశ్చితార్థం జరిగింది. ఈ నెల 6 వ తేదీ సోమవారంపెండ్లి బట్టలు కొనాల్సి ఉండగా 5 వ తేదీ ఆదివారం సాయంత్రం ఒక లెటర్ రాసి పెట్టి తాను పనిచేస్తున్న సాయి బాలాజీ డిజిటల్ నుంచి వెళ్లిపోయాడు. మల్లేశం కోసం కుటుంబ సభ్యులు చుట్టుపక్కల, పరిసర ప్రాంతాల్లో, బంధువుల వద్ద ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. ఆదివారం మల్లేశం తమ్ముడు పి. ప్రభాకర్ చందానగర్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు‌ చందానగర్ పోలీస్ స్టేషన్ కు 040- 227853911, 9490617118, 7901110877 నంబర్లకు గాని 100 కు గాని ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.

అదృశ్యమైన మల్లేశం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here