ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటా – చందానగర్ బిజెపి కాంటెస్టెడ్ కార్పొరేటర్ సింధూరఘునాథ్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి ఆదరణ చూపించి భారీ ఎత్తున మద్దతు తెలిపిన చందానగర్ డివిజన్ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని చందానగర్ డివిజన్ బీజేపీ కాంటెస్టెడ్ కార్పోరేటర్ కసిరెడ్డి సింధూ రఘునాథ్ రెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగి సంవత్సరం గడిచిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ మమ్మల్ని నమ్మి మా వెంట నడిచిన చందానగర్ డివిజన్ ప్రజలందరికి రుణపడి ఉంటామన్నారు. చందానగర్ డివిజన్ లో చాలా సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని, అధికార పార్టీ అవగాహనారాహిత్యం ప్రజలకు కష్టంగా దాపురించిందని ఆమె పేర్కొన్నారు. ప్రజలకు సంబంధించిన సమస్యలపై ప్రశ్నించే గొంతుకనై పరిష్కారం కోసం నిరంతరం అందుబాటులో ఉంటానని ఆమె అన్నారు. డివిజన్ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ప్రశ్నించి పరిష్కారమయ్యేలా చూస్తామని అన్నారు. చందానగర్ డివిజన్ అభివృద్ధికి అన్ని రకాల పోరాటాలతో పరిష్కారం చూపుతామని కసిరెడ్డి సింధూ రఘునాథ్ రెడ్డి అన్నారు.

చందానగర్ డివిజన్ బీజేపీ కాంటెస్టెడ్ కార్పోరేటర్ కసిరెడ్డి సింధూ రఘునాథ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here