నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ మలిదశ ఉద్యమంలో మొట్టమొదటగా ప్రాణాలర్పించిన విద్యార్థి శ్రీకాంతాచారి ని తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం ఎన్నటికీ మరవదని శేరిలింగంపల్లి నియోజకవర్గం ఉద్యమకారులు పేర్కొన్నారు. చందానగర్ లోని గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని ఉద్యమకారులు ప్రత్యేక రాష్ట్రం కోసం అమరుడైన ఉద్యమ బిడ్డ శ్రీకాంతాచారి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మిద్దెల మల్లారెడ్డి, గంగారం సంగారెడ్డి, నిమ్మల శేఖర్ గౌడ్, షేక్ జమీర్, వెంకటేష్ గౌడ్, డాక్టర్ రమేష్, వెంకట్ రెడ్డి, ఉమేష్, శ్రీనివాస్, దిలీప్, హనుమంతు, శంకర్, ఆర్.వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమకారుడు వెంకటేష్ గౌడ్ తన ఉద్యమకాలం నాటి పాటలతో అందరిని ఉద్యమ జ్ఞాపకాలను ముందుకు తీసుకువచ్చారు.