బస్ షెల్టర్‌ను ఏర్పాటు చేసిన ఆర్ కే వై టీం – అభినందించిన రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: ప్రయాణీకుల సౌకర్యార్థం బస్ షెల్టర్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ అన్నారు. ఆర్ కే వై టీం సభ్యుల ఆధ్వర్యంలో మియాపూర్ – బొల్లారం రోడ్డులో ఏర్పాటు చేసిన మక్తా బస్ షెల్టర్ ను‌ శుక్రవారం బిజెపి నాయకులు రవికుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా మియాపూర్ బొల్లారం రోడ్డు నందు ఉన్న బస్టాప్ శిథిలావస్థలో ఉన్న విషయం తెలుసుకున్న ఆర్ కే వై టీం సభ్యులు తమ సొంత ఖర్చులతో శిథిలావస్థలో బస్టాప్ ను పునర్ నిర్మించడం జరిగిందన్నారు. ప్రయాణికులకు ఈ బస్ షెల్టర్ ను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేసిన ఆర్ కే వై టీం సభ్యులను అభినందించారు. మున్ముందు ఇదే ఉత్సాహంతో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆర్ కే వై టీం సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో‌ బిజెపి‌ సీనియర్ నాయకులు వినోద్ రావు, రాఘవేంద్ర రావు, నాగుల్ గౌడ్, లక్ష్మణ్ ముదిరాజ్, ఎం సి రెడ్డి, మాణిక్, శ్రీనివాస్ యాదవ్, సదానంద్ యాదవ్, ఎల్లేష్, రాధాకృష్ణ యాదవ్, వినోద్ యాదవ్, బాబు ముదిరాజ్, ఆర్ కే వై కమిటీ సభ్యులు గుండె గణేష్ ముదిరాజ్, జాజి రావు, శ్రీనివాస్, రాము, శ్రీధర్, మల్లేష్, శివ, తదితరులు పాల్గొన్నారు.

మక్తా బస్ షెల్టర్ ప్రారంభోత్సవంలో రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here