కాపుల ఐక్యతకు పాటుపడుదాం : కార్తీక వనభోజనాల్లో కాపు సంఘం ప్రతినిధులు

నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని బొటానికల్ గార్డెన్ లో కాపు సంఘం ఆధ్వర్యంలో కార్తీకమాసం వనభోజనాలు జరుపుకున్నారు. కాపు సంఘం కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో వనభోజనాల్లో పాల్గొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆహ్లాదంగా గడిపారు. ఒకరికొకరు యోగ‌ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కాపులు సంఘటితంగా ఉంటారని ఎవరికి ఏ సమస్య వచ్చినా ప్రతి ఒక్కరు చొరవ తీసుకుని స్నేహభావంతో కలిసి ఉండాలని ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాలలో కాపులు విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయపరంగా అగ్రగామిగా ఉంటున్నారని, ప్రతి ఒక్కరూ అన్ని రంగాల్లో రాణించి కాపుల ఐక్యతను చాటాలన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతిసారి నిర్వహిస్తూ అందరం ఒక దగ్గరికి వచ్చి కలుసుకునే విధంగా చేసిన కొండాపూర్ కాపు సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

కార్తీక మాసం వనభోజనాల్లో పాల్గొన్న కాపు సంఘం ప్రతినిధులు

ఈ కార్యక్రమంలో మాజీ డీఐజీ కె వేణుగోపాల్ రావు, మాజీ ఐజీ జె ప్రభాకర్ రావు, ఏపీ ఐఏఎస్ అధికారి పి అర్జున్ రావు, ఏపీ ఇరిగేషన్ అడిషనల్ సెక్రటరీ ఎం వి ఎల్ కాళీ కుమార్, చిక్కడపల్లి ఏసీపీ సిహెచ్ శ్రీధర్, కాపు సంఘాల సంక్షేమ సేవా సమితి అధ్యక్షుడు మిరియాల రాఘవరావు, సినీ నటుడు విక్రమ్, వాయిస్ టు డే ఎండీ కొత్త లక్ష్మణ్ పటేల్, మియాపూర్ కాపు సంఘల అడ్వయిజర్ సమ్మెట ప్రసాద్, తెలంగాణ మున్నూరు కాపు సంఘం ప్రెసిడెంట్ కొండ దేవయ్య పటేల్, కొండాపూర్ డివిజన్ జనరల్ సెక్రటరీ వేదిక రమేష్ పటేల్, శేరిలింగంపల్లి కోఆర్డినేటర్ వాసాల వెంకటేశ్వర్లు పటేల్, పెరిక రవీందర్ పటేల్, కృష్ణానగర్ మున్నూరు కాపు సంఘం ప్రెసిడెంట్ పోగుల సతీష్, ధర్మారావు, గోలి శ్రీనివాస్ నాయుడు, చెన్న కేశవ రావు, వెంకటరమణ, మహిళా విభాగం నాయకులు విజయలక్ష్మి, మాధవి, ఆదిలక్ష్మి ,వాణి తదితరులు పాల్గొన్నారు.

బొటానికల్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన వనభోజనాల్లో పాల్గొన్న కాపు కుటుంబ సభ్యులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here