నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 72వ రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయులు ఎల్. శంకర్ అధ్యక్షతన శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులు భారత రాజ్యాంగం విశిష్టత గురించి ప్రసంగించారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, అనేకమంది మేధావుల కృషి వల్ల ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం రూపుదిద్దుకుందని, దాని పరిణామమే మన భవ్యమైన, నవ్యమైన భారతదేశమని రాజ్యాంగం గురించి వివరించారు. ఈ కార్యక్రమములో పాఠశాల ఉపాధ్యాయులు పి. శివ కుమార్ , భాస్కర్ యాదవ్, రమణ కుమారి, దుర్గ భవాని, కిష్టయ్య, సురేష్ తదితరులు ఉన్నారు.