నమస్తే శేరిలింగంపల్లి: కుస్తీ పోటీల్లో మగవారే కాదు అమ్మాయిలు సైతం సై అంటున్నారు. అమ్మాయిలు ఎందులోనైనా మగవారికి ధీటని నిరూపిస్తున్నారు. మగవారికి మాత్రమే ప్రత్యేకమైన కుస్తీ పోటీలో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ తనదైన శైలిలో దూసుకుపోతోంది ఓ చిన్నారి. కొండాపూర్ రాఘవేంద్ర కాలనీకి చెందిన బిజెపి నాయకులు చంద్రశేఖర్ యాదవ్ కూతురు కీర్తన యాదవ్ స్థానిక హార్బర్ ఇంటర్నేషనల్ స్కూల్ లో 9వ తరగతి చదువుతోంది. కుస్తీ పోటీల్లో మక్కువతో రంగారెడ్డి జిల్లా కోకాపేట లో రంగారెడ్డి జిల్లా అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన అండర్ 15 రంగారెడ్డి రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ పోటీలో పాల్గొని ప్రత్యర్థులను చిత్తు చేసి బంగారు పతకాన్ని సాధించింది.
పలువురి అభినందనలు
రెజ్లింగ్ ఇంటర్నేషనల్ కోచ్ నార్సింగ్ శ్రీకాంత్ యాదవ్ శిక్షణలో బంగారు పతకం సాధించిన కీర్తనను శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్, బోయిన్ పల్లి వినోద్ రావ్ తో పాటు తదితరులు అభినందించారు.