నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని అరబిందో కాలనీ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆ కాలనీ అసోసియేషన్ సభ్యులు స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ను విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అరబిందో కాలనీ అసోసియేషన్ సభ్యులు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ను కలిసి తదితర సమస్యలపై చర్చించారు. కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని కోరారు. కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ మాట్లాడుతూ అరబిందో కాలనీలో ప్రజల సౌకర్యార్థం మౌలిక వసతుల కల్పనకు తప్పకుండా కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సహకారంతో మియాపూర్ డివిజన్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు.