నమస్తే శేరిలింగంపల్లి: గ్యార్మి పండుగను పురస్కరించుకుని నెహ్రూ నగర్ లో ఉత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ యువజన నాయకులు రాగం అనిరుద్ యాదవ్ గ్యార్మీ ఉత్సవంలో పాల్గొని దర్గాలో పెద్ద ఎత్తున ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువులు, ముస్లింలు మమేకంగా ఘనంగా గ్యార్మీ పండుగ జరుపుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం ముస్లిం మాసాల ప్రకారం రబ్బీసాని మాసంలో దర్గా వద్ద గ్యార్మీ పండుగ జరుపుకుంటారని అన్నారు. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం ఒకరి ఇంటి వద్ద నుండి సందల్ ఊరేగింపుతో దర్గా వద్దకు చేరుకుని ప్రతి ఒక్కరూ తమ ఇంటి నుండి జెండా దర్గా వద్దకు తీసుకువచ్చి దర్గా వద్ద నిలుపుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫక్రు, గఫ్ఫార్, సుభాష్, గోపాల్ యాదవ్, కమిటీ సభ్యులు, స్థానిక ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.