నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దేవాలయాల అభివృద్ధికి విశేషంగా కృషి చేయడం జరుగుతుందని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ అన్నారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో మాజీ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సీతారాముల వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాలను అభివృద్ధి చేస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఏర్పాటు చేసే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. వారి వెంట మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, రాష్ట్ర కమ్మసంఘం ఉపాధ్యక్షులు బొడ్డు రవిశంకర్ రావు, రాష్ట్ర కోశాధికారి కండెపనేని రత్నాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.