నమస్తే శేరిలింగంపల్లి:గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి, ఎన్టీఆర్ నగర్, తాజ్ నగర్, ప్రశాంత్ హిల్స్ కాలనీలలో రూ. 2 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్ నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు గంగాధర్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ సాయిబాబా తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ప్రజలకు మౌలిక వసతుల కల్పన కోసం తమ శాయశక్తులా పనిచేస్తామని అన్నారు. గోపన్ పల్లి, ఎన్టీఆర్ నగర్, తాజ్ నగర్ కాలనీలలో కోటి రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు, ప్రశాంత్ హిల్స్ కాలనీలలో కోటి రూపాయల అంచనావ్యయం తో చేపట్టనున్న యూజీడీ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు రాజు నాయక్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు రాజు యాదవ్, నాయకులు చెన్నం రాజు , నరేష్, సత్యనారాయణ, సురేందర్, సతీష్, జగదీష్, వినోద్, మల్లేష్, రమేష్, రాజు ముదిరాజ్, జగదీష్, ఆకుల యాదగిరి, రామేశ్వరమ్మ, అంజమ్మ, అరుణ, విజయ కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.