నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్, హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మాదాపూర్డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ కోరారు. బుధవారం జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఈఈ శ్రీకాంతిని కలిసి మాదాపూర్, హఫీజ్ పేట్ డివిజన్లలో నెలకొన్న సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ చర్చించారు. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు పూర్తయిన చోట సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉందన్నారు. వాటితో పాటు పలు చోట్ల అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో డీఈ స్రవంతి, ఏఈలు ధీరజ్, ప్రశాంత్ తదితరులు ఉన్నారు.