నమస్తే శేరిలింగంపల్లి: హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమితో కేసీఆర్ కు కనువిప్పు కలిగి, తన ఆలోచనలను ప్రజాసమస్యలపై దృష్టి పెట్టడంతో ప్రజలకు మేలు జరుగుతుందని బిజెవైఎం రాష్ట్ర నాయకురాలు కసిరెడ్డి సింధూ రఘునాథ్ రెడ్డి అన్నారు. ఈటల గెలుపుతో ఇప్పటికైనా ఫాంహౌజ్ నుంచి బయటకు వచ్చి ప్రజలకు సుపరిపాలన అందించాలన్నారు. ఈటెల రాజేందర్ కు ఉన్న ఆదరణ, బిజెపి కార్యకర్తల కృషి, ప్రజాబలంతో విజయం సాధ్యమైందన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రత్యామ్నాయంగా బిజెపి వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని కసిరెడ్డి సింధూ రఘునాథ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కసిరెడ్డి రఘునాథ్ రెడ్డి , నందనం విష్ణు దత్త, శ్రీనివాస్ ముదిరాజ్, శివ, అర్జున్, విజయ్, శివ రత్నాకర్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.