నమస్తే శేరిలింగంపల్లి:మియాపూర్ లో ప్రపంచ మానవ హక్కుల సంఘం తెలంగాణ స్టేట్ చైర్మన్ తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రపంచ మానవ హక్కుల సంఘం రెండో వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ చైర్మన్ మొరం రెడ్డి సుబ్బారెడ్డి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దినేష్ కుమార్, సీఈవో సురేష్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర చైర్మన్ తౌట్ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కమిటీలు వేసి ప్రజలకు చేరువయ్యామన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా ముందుండి ఎదుర్కొంటూ న్యాయం జరిగేలా సంస్థలోని సభ్యులందరూ ఐకమత్యంగా పనిచేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఆయా జిల్లాల చైర్మన్లు, వైస్ చైర్మన్లు పాల్గొన్నారు.