ప్లీనరీకి వచ్చే వాహనాల పార్కింగ్ ఏర్పాట్లపై ప్రభుత్వ విప్ గాంధీ పరిశీలన

నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ పార్టీ ద్వి దశాబ్ది వేడుకల్లో భాగంగా హైటెక్స్ లో ఈ నెల 25న నిర్వహించే పార్టీ ప్లీనరీ సమావేశం ఏర్పాట్లను టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం సోమవారం సాయంత్రం స్థానిక కార్పొరేటర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్లీనరీ సమావేశంలో హాజరయ్యే ప్రతినిధుల వాహనాల పార్కింగ్ ఏర్పాట్లను స్వయంగా దగ్గరుండి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ప్లీనరీ సమావేశానికి వచ్చే ప్రజా ప్రతినిధుల కోసం చేస్తున్న ఏర్పాట్లు, పార్కింగ్ ఏర్పాట్లు సకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తున్నామని అన్నారు. సభా వేధికకు వచ్చే వారి వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు, ట్రాఫిక్ సమస్య లేకుండా, ప్రజలకు ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. నిర్ణీత కాలానికి ముందే ఏర్పాట్లన్నీ పూర్తి కావాలని సంబంధిత ఇంచార్జీలకు ఆరెకపూడి‌ గాంధీ సూచించారు. అధికారులు, పోలీస్ ల పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు గౌస్, కాజా, లోకేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

ప్లీనరీ కి వచ్చే వాహనాల పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here