నల్లగండ్ల శ్రీ సోమేశ్వర స్వామి ఆలయ కమిటీ కార్యాలయాన్ని ప్రారంభం

నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి‌ గాంధీ పేర్కొన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల లో శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం వద్ద రూ. 14 లక్షల అంచనావ్యయం తో నూతనంగా నిర్మించిన దేవాలయ కమిటీ కార్యాలయాన్ని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి ‌గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాలను అభివృద్ధి చేసుకోవాల్సిన‌ అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఆలయాల్లో నెలకొన్న సమస్యలు ఏవైనా ఉంటే‌ తమ దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారానికి ‌కృషి చేస్తామని అన్నారు. ఆలయ కమిటీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చెన్నం రాజు, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, టీఆర్ఎస్ శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు రాజు యాదవ్ ,ఆలయ కార్యాలయం భవనం దాత విఠల్, ఆలయ కమిటీ ప్రతినిధులు యాదగిరి, వసంత కుమార్, నరేందర్ రెడ్డి, రమేష్, రాధ, టీఆర్ఎస్ నాయకులు నరేష్, సత్యనారాయణ, సురేందర్, చింత కింది రవీందర్, పొడుగు రాంబాబు, జగదీష్, వినోద్, మల్లేష్, అరుణ కుమారి తదితరులు పాల్గొన్నారు.

శ్రీ సోమేశ్వరాలయ కమిటీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here