బిజెపి సేవా సమర్పన్ అభియాన్ లో భాగంగా హఫీజ్ పేట్ లో ఉచిత మెగా వైద్య శిబిరం

నమస్తే శేరిలింగంపల్లి: భారతీయ జనతా పార్టీ సేవా సమర్పన్ అభియాన్ లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అధికారికంగా రాజకీయాల్లో 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షుడు శ్రీధర్ రావు ఆధ్వర్యంలో శనివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర నాయకులు బిక్షపతి యాదవ్, మమత అకాడమీ ఆఫ్ సైన్సెస్ మేనేజింగ్ డైరెక్టర్ నయన్ రాజ్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ చంద్ర శేఖర్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ప్రపంచ దేశాలకు మోదీ ఆదర్శంగా నిలిచారని, పాలనాదక్షతకు మోదీ నిదర్శనమని బిక్షపతి యాదవ్ అన్నారు. బిజెపి అసెంబ్లీ ఇంచార్జీ గజ్జల యోగానంద్, రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్, జ్ఞానేంద్ర ప్రసాద్ సహకారంతో మమత అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ వారి సారథ్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో నిపుణులచే వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఇంచార్జీ గజ్జల యోగానంద్ చేతుల మీదుగా డాక్టర్లను, పారామెడికల్ సిబ్బందిని సన్మానించి మెమొంటోలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రవి కుమార్ యాదవ్, కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, మనోహర్, కలివేముల, రవి గౌడ్, వినయ, పార్వతి, మేరీ, వినీత సింగ్, కల్పన, సింధు రెడ్డి, ఉప్పల విద్య కల్పన ఏకాంత్ గౌడ్, నరేంద్ర ముదిరాజ్ , వర ప్రసాద్, చంద్రమోహన్ నందు కుమార్, శ్రీనివాస్ యాదవ్, బాబు రెడ్డి, లక్ష్మణ్ గౌడ్, శ్రీశైలం కురుమ, నాందేవ్ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఉచిత మెగా వైద్య శిబిరంలో పాల్గొన్న బిజెపి నాయకులు

 

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here