నమస్తే శేరిలింగంపల్లి: కాలనీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తానని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పేర్కొన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీ, కృషినగర్ కాలనీ వాసులు పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ మాట్లాడుతూ దశల వారీగా ఆయా కాలనీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. అన్ని విధాల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.