నమస్తే శేరిలింగంపల్లి: ప్రజలకు మెరుగైన మౌలిక వసతుల కల్పనకు శాయశక్తులా కృషి చేస్తున్నామని, డివిజన్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. మాదాపూర్, హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీలో మంచినీటి సరఫరా, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని వాటర్ వర్క్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు గురువారం హెచ్ఎండబ్ల్యుఎస్ ఎస్ బి జీఎం రాజశేఖర్ కు పలు సమస్యలపై కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ వినతి పత్రం అందజేశారు. మాదాపూర్, హఫీజ్ పేట్ డివిజన్ల పరిధిలో పెండింగ్ లో ఉన్న వాటర్ పైపులైన్ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వెంటనే పెండింగ్ పనులను పూర్తిచేయాలని, యూజీడీ సమస్యలు లేకుండా చూడాలని కోరారు. డీజీఎంలు శ్రీమన్నారాయణ, నాగప్రియ, మేనేజర్లు లివర్తి, పుర్నేశ్వరి, సుబ్రమణ్యం రాజు ఉన్నారు.