నమస్తే శేరిలింగంపల్లి: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ త్వరగా కోలుకోవాలని అంబేద్కర్ సంఘం శేరిలింగంపల్లి అధ్యక్షుడు జెల్లె విజయ్ ఆకాంక్షించారు. కాలుకు గాయమై శస్త్రచికిత్స చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న మందకృష్ణ మాదిగ ను విజయ్ కలిసి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శేరిలింగంపల్లి అంబేద్కర్ సంఘము అధ్యక్షునిగా ఎన్నికైన శుభ సందర్భంగా జెల్ల విజయ్ ను మందకృష్ణ మాదిగ అభినందించారు. అంబేద్కర్ యువజన నాయకులు మన జాతి సంఘటితం కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం అహర్నిశలు కృషి చేస్తూ వారి అభ్యున్నతికి ముందు తరాలు స్మరించుకునేలా నిరంతరం కృషి చేయాలని మార్గదర్శనం చేశారని విజయ్ పేర్కొన్నారు.