నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండగను పురస్కరించుకొని అక్టోబర్ 2 వ తేదీ నుండి మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు . ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి సంవత్సరం బతుకమ్మ పండగకు రాష్ట్రంలోని ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం ఆనవాయితీగా ఇస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని మహిళలు బతుకమ్మ పండుగను ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటారని, రాష్ట్ర ప్రభుత్వం మహిళల గౌరవార్థం ఉచితంగా చీరల పంపిణి చేయడం జరుగుతుందన్నారు. దశాబ్దాలుగా దగాపడ్డ వస్త్ర పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం జీవంపోసి చేనేతలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.